News October 24, 2025
నాగార్జున యూనివర్సిటీ డిప్లొమా జర్నలిజం ఫలితాలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఆగష్టు 2025లో నిర్వహించిన డిప్లమో ఇన్ జర్నలిజం ఫలితాలను శుక్రవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. డిప్లమో ఇన్ జర్నలిజంలో 56% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 4లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1,860, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2,190లు చెల్లించాలన్నారు.
Similar News
News October 25, 2025
అడవినెక్కలంలో లారీ, బైక్ ఢీ.. మహిళ మృతి

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నున్న గ్రామానికి చెందిన దేవశెట్టి ప్రమీల దేవి (60) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. నెక్కలం అడ్డరోడ్డులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భార్యాభర్తలు ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ప్రమీల దేవి మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 25, 2025
మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
News October 25, 2025
ప్రత్యేక సదరం క్యాంపుల నిర్వహణకు చర్యలు: దీపక్ తివారీ

జిల్లాలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పునరుద్ధరణ కొరకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి సెర్ప్ సిఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా అదనపు కలెక్టర్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కొరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.


