News October 24, 2025
బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు: SP

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. చంద్రగిరి సబ్ డివిజన్ MR.పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News October 25, 2025
ADB: మనం వెళ్లే బస్సు భద్రమేనా..?

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిన్నర కాలంలో నిర్మల్ ఘాట్, గుడిహత్నూర్ జాతీయ రహదారిపై డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్‌లోడింగ్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోజూ కేవలం ADB నుంచి HYD వరకు 50కి పైగా ప్రైవేట్ బస్సు సర్వీసులు నడుస్తాయి. తాజాగా, కర్నూలు వద్ద 19 మంది సజీవ దహనం కావడంతో, ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలి.
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.
News October 25, 2025
ప్రతీ ఆలయాన్ని దీపాలతో అలకరించాలి: మంత్రి కొండా

కార్తీక దీపోత్సవాన్ని కనుల పండగలా నిర్వహించాలని, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక దీపోత్సవం 22.10.2025 నుంచి 19.11.2025 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.


