News October 24, 2025
దీపావళి టార్గెట్.. ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ISIS కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరుగల ఇద్దరు ISIS ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్, పబ్లిక్ పార్క్‌లో దాడి చేసేందుకు సిద్ధమైన వీరిద్దరినీ ఢిల్లీ, భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. OCT 16నే వారిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు.
Similar News
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
News October 25, 2025
C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

<
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


