News October 24, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APEDA 11 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు NOV 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://apeda.gov.in/
Similar News
News October 25, 2025
HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.
News October 25, 2025
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులు వాడతారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా చూసుకోవాలంటున్నారు.
News October 25, 2025
ఏపీ రౌండప్

* బస్సు ప్రమాదం.. ఏపీకి చెందిన మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం
* డిగ్రీ 3వ విడత ప్రవేశాలు.. ఈ నెల 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 25-27న వెబ్ ఆప్షన్లకు అవకాశం, NOV 1న సీట్ల కేటాయింపు
* ఖరీఫ్ ధాన్యం సేకరణకు రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం హామీ
* అమరావతిలో RBI రీజనల్ ఆఫీసు.. నేలపాడులో 3 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం


