News April 9, 2024
ఆకుపై చిత్రాలతో ఉగాది శుభాకాంక్షలు

నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకు మార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఈరోజు ఉగాది పచ్చడికి వినియోగించే మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, చెరకు గడలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్లు, కోయిలలు, చిలకలు, ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి ఆయన స్వాగతం పలికారు.
Similar News
News September 10, 2025
మెదక్: క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు పనులకు బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలోని యువ సిబ్బంది ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలను నిర్వహించేందుకు క్రికెట్ మైదానం ఉపయోగపడుతుందన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News September 10, 2025
మెదక్: చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

మెదక్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News September 10, 2025
మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.