News October 24, 2025
98 పోస్టులకు నోటిఫికేషన్

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL) 98 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు NOV 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్ <<>>కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 25, 2025
INTER సిలబస్‌లో సమూల మార్పులు: బోర్డు

TG: ఇంటర్ సిలబస్‌ను NCERT గైడ్‌లైన్స్ ప్రకారం రివిజన్ చేస్తామని బోర్డు సెక్రటరీ కృష్ణ చైతన్య తెలిపారు. ‘గణితం, ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీల రివిజన్ జరిగి 13 ఏళ్లయింది. ఇతర సబ్జెక్టుల రివిజనూ 2020కి ముందు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వీటిని అప్‌డేట్ చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లతో అధ్యయనం చేయించి వారి సూచనలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
News October 25, 2025
RO-KO షో.. రికార్డులు బద్దలు

* ODIల్లో మోస్ట్ 150+ పార్ట్‌నర్‌షిప్స్: సచిన్-గంగూలీ రికార్డు సమం చేసిన RO-KO(12)
* ODIs+T20Isలో అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ(18,443*). సచిన్ రికార్డు బద్దలు(18,436)
* వన్డేల్లో సచిన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కోహ్లీ(14,255*)
* 101 ఇన్నింగ్స్‌ల్లో 19సార్లు 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన RO-KO
* ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ 50* సెంచరీలు
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్: రోహిత్
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.


