News October 24, 2025
తిరుపతి: జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

APSSDC ఆధ్వర్యంలో జర్మనీలో ఎలక్ట్రిషన్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసి, 2 ఏళ్ల అనుభవం కలిగి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 02.
Similar News
News October 25, 2025
అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు: కోర్టు

అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. పేరు, ఫొటోల ఏఐ మార్ఫింగ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఇటీవల చిరు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో 30 మందికి నోటీసులు జారీ చేసింది.
News October 25, 2025
వనపర్తి: ఇంటర్ విద్యార్థుల నుంచి గుర్తింపు, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు

ప్రభుత్వ సెక్టార్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు రూ.220,గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు CGG వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.inలో చెల్లింపు గేట్‌వే ఉపయోగించి జమ చేయాలని కాలేజీ ప్రిన్సిపల్‌లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
News October 25, 2025
డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో డీసీపీ అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగ తీవ్రంగా గాయపడగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


