News October 24, 2025

గద్వాల: బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి

image

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ఈ బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు మృతి చెందగా, పది మంది గాయాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Similar News

News October 25, 2025

వనపర్తి: ప్రజావాణి ప్లేస్ తాత్కాలికంగా మార్పు

image

వనపర్తి జిల్లాలో ఈనెల 27న నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం వచ్చే సోమవారం సాధారణంగా జరిగే కలెక్టరేట్ మీటింగ్ హాల్ (IDOC) లో కాకుండా, RDO కార్యాలయం సమావేశ మందిరం (రూమ్ 3) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 27న ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం ఉండటంతో ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పు చేశామన్నారు.

News October 25, 2025

ఫోన్ చేసి పిలిపించి… గోదాం తీయించి..!

image

వర్ధన్నపేట పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తాళం వేసి ఉండటంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫోన్ చేసి రప్పించి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి వర్షిని, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణితో కలిసి గిడ్డంగిని పరిశీలించారు. వారు క్షేత్ర స్థాయిలో స్టాక్ రిజిస్టర్‌ను, గోదాంలోని బియ్యం నిల్వ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

News October 25, 2025

వరల్డ్ కప్.. RO-KO ఆడతారహో!

image

క్రికెట్ ప్రపంచం మొత్తం ‘RO-KO’ అంటూ నినదిస్తోంది. AUSపై మూడో వన్డేలో రోహిత్(121*)-కోహ్లీ(74*) అదరగొట్టేశారు. ఈ ప్రదర్శనతో ఫ్యాన్స్‌లో WC-2027పై ఆశలు చిగురించాయి. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ గురించి అడగ్గా.. ఎగ్జైటెడ్‌గా ఉన్నామని రోహిత్, కోహ్లీ సమాధానం చెప్పారు. దీంతో ‘వీళ్లకు ఏజ్ జస్ట్ ఏ నంబర్, వరల్డ్ కప్‌కు రో-కో వస్తున్నారు, ఈ జోడీ ఉంటే కప్పు మనదే’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.