News April 9, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: సిద్ధార్థనాథ్

image

ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అమరావతిని రాజధానిగా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేయట్లేదని విమర్శించారు.

Similar News

News February 6, 2026

BREAKING: భారీగా తగ్గిన వెండి ధర

image

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 2 రోజుల్లోనే వెండి ధర రూ.40 వేలు తగ్గింది.

News February 6, 2026

శ్రీవారి నేత్ర దర్శనం ఏరోజు ఉంటుందంటే?

image

శ్రీ వేంకటేశ్వర స్వామి నేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అలాగే ప్రకాశవంతమైనవి కూడా! ఆ విశ్వశక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. అందుకే స్వామివారి కళ్లను ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. కేవలం గురువారం నాడు మాత్రమే ఆయన కళ్లను చూడవచ్చు. ఆనంద నిలయంలో ప్రతి గురువారం ‘నిజరూప దర్శనం’ సమయంలో మాత్రమే ఆ కర్పూర నామాన్ని తగ్గించి స్వామివారి నేత్రాలను చూసే అవకాశం కల్పిస్తారు.

News February 6, 2026

తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

image

భారత్-US ట్రేడ్‌ డీల్‌ తర్వాత బంగ్లాదేశ్‌ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్‌కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.