News October 24, 2025
అరుణాచాలానికి ప్రత్యేక యాత్ర బస్సు ఏర్పాటు: మంథని RTC DM

అరుణాచల గిరి ప్రదక్షిణ వీక్షణకు మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపించనున్నట్లు డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. నవంబర్ 3 సోమవారం సాయంత్రం మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలంపూర్ జోగులాంబ దర్శనాలు ఉంటాయన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.5,040, పిల్లలకు రూ.3,790. మరిన్ని వివరాలకు 9959225923, 9948671514 నంబర్లను సంప్రదించవచ్చు.
Similar News
News October 25, 2025
విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్‌ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.
News October 25, 2025
నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

40ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పులు, జీవక్రియలు నెమ్మదించి చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 25, 2025
ఘోర ప్రమాదం.. బస్సు నడిపింది ఇతనే!

AP: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ బస్సును పల్నాడు(D) ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపాడు. సాధారణంగా హెవీ లైసెన్స్ కోసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. కానీ 5వ తరగతి వరకే చదువుకున్న లక్ష్మయ్య టెన్త్ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ పొందాడు. 2014లోనూ లారీ నడుపుతూ యాక్సిడెంట్ చేయగా ఆ ఘటనలో క్లీనర్ చనిపోయాడు.


