News October 24, 2025
KNR: స్లాట్ బుకింగ్స్ ప్రారంభం.. రూ.8,110 మద్దతు ధర

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈరోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంటను విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా ప్రభుత్వం రూ.8,110ల మద్దతు ధర ప్రకటించింది.
Similar News
News October 25, 2025
పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.
News October 25, 2025
ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News October 25, 2025
బేకరీపై టాస్క్‌ఫోర్స్ దాడులు

వరంగల్ ఫోర్టు రోడ్డులోని ఓ బేకరీ షాపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గడువు తీరిన, నాణ్యత లేని రూ.11 వేల విలువైన తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం షాపు యజమానిని మున్సిపల్ ఆరోగ్య విభాగానికి అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.


