News April 9, 2024
HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?
Similar News
News October 27, 2025
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ భద్రత

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన గేటు వద్ద ఏసీపీ, 3 ఇన్స్పెక్టర్లు, ఐదుగురు SIలు, 8 మంది ASIలు, 41 మంది కానిస్టేబుళ్లు ఉండనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒక ప్లాటూన్ సాయుధ బలగాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండనున్నాయి. స్టేడియానికి వెళ్లే రోడ్డులో 6 పికెటింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
News October 27, 2025
‘ఇంతకీ జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి చేస్తారంట’

తెలంగాణలో ఖరీదైన ఏరియా అంటే జూబ్లీహిల్స్ గుర్తొస్తుంది. ఇక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. తిరగని సెలబ్రెటీ ఉండరు. కొండ ప్రాంతం ఎవరి ఊహలకు అందనంత అభివృద్ధి చెందింది. బైపోల్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి తమ పార్టీలతోనే సాధ్యమని నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తమ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ అంత అభివృద్ధి చేస్తామని చెబుతుంటే, కొత్తగా ఇక్కడ ఏంఅభివృద్ధి చేస్తారో చెప్పకపోవడం ఓటర్లకు అంతుచిక్కని ప్రశ్న.
News October 27, 2025
HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.


