News October 24, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ ఫలితాల విడుదల

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.
Similar News
News October 25, 2025
హైదరాబాద్ వెదర్ అప్‌డేట్

నగరంలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
News October 25, 2025
హైదరాబాద్‌లో వర్షపాతం ఇలా..!

గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఈది బజార్ ప్రాంతంలో 6.8 మి.మీ, సర్దార్ మహల్ 5.5, రియాసత్‌నగర్ 3.8, రూప్‌లాల్ బజార్, డబీర్‌పుర 3.8, బహదూర్‌పుర, యాకుత్‌పుర 3.3, ఖలందర్‌నగర్ 6.5, గోల్కొండ 1.8, అసిఫ్‌నగర్ 3.0, జియాగూడ 1.3, బేగంబజార్, జుమ్మెరాత్ బజార్ 3.8, ముషీరాబాద్‌లో 2.0, హిమాయత్‌నగర్, అంబర్‌పేటలో 1.3 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చిరుజల్లు కురిశాయి.
News October 25, 2025
HYD: మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా.. జర జాగ్రత్త..!

ఓ మహిళ మంటల్లో కాలిపోయిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD సరూర్‌నగర్ PS పరిధి త్యాగరాయనగర్ కాలనీలోని MSR రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో మాధవి(45) నివాసం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత బయటకు వెళ్లిన మాధవి కొద్దిసేపు తర్వాత తిరిగొచ్చి వెలిగించింది. దీంతో మంటలు అంటుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. కేసు నమోదైంది. జర జాగ్రత్త..!


