News October 24, 2025
పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.
Similar News
News October 25, 2025
NLG: బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారో..!

డీసీసీలు ఇవాళ ఖరారు కానున్నారు. ఢిల్లీలో అధిష్ఠానంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యూనిట్‌గా తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎంతమంది ఉండాలన్నది నిర్ణయించి అధ్యక్షులను ఖరారు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
News October 25, 2025
NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

బ్రెయిన్ డెడ్ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.
News October 25, 2025
NLG: 31 వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ

ఆసరా పింఛన్లను ఈ నెల 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని సూచించారు.


