News October 24, 2025

అమరావతిలో RBI ప్రధాన కార్యాలయ నిర్మాణానికై పూర్తైన ఒప్పందం

image

అమరావతిలోని నేలపాడులో 3 ఎకరాలలో 1.6 లక్షల చదరపు అడుగులలో RBI ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ముందడుగు పడింది. రూ.12 కోట్లు చెల్లించిన RBI..భూ కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది. సంబంధిత పత్రాలను CRDA ల్యాండ్స్ విభాగ అధికారి వి.డేవిడ్ రాజు..RBI అధికారి వీసీ రూపకు శుక్రవారం అందజేశారు. ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంతో పాటు అమరావతిలో RBI రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు CRDA తెలిపింది.

Similar News

News October 25, 2025

HYD: చిన్నారుల్లో పెరుగుతున్న నిమోనియా.. జర జాగ్రత్త..!

image

HYDలోని NIMS, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం వస్తున్న పిల్లల్లో నిమోనియా కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుత శీతాకాలంలో పిల్లలను బయట వాతావరణానికి, చలికి దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రతాప్ సింగ్ సూచించారు. చిన్నారుల్లో రోజు రోజుకు నిమోనియా కేసులు పెరుగుతున్నాయని, క్రిటికల్ కేసులను ICU ప్రత్యేక విభాగంలో వైద్యం అందిస్తున్నామన్నారు. జర జాగ్రత్త! SHARE IT

News October 25, 2025

రాజోలి మండలంలో అత్యధిక వర్షపాతం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గద్వాల జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున రాజోలి మండలంలో అత్యధికంగా 37.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అయిజలో 21.0 మి.మీ., కేటీదొడ్డిలో 19.8 మి.మీ., వడ్డేపల్లిలో 11.0 మి.మీ. వర్షం కురిసింది. ధరూర్, ఉండవెల్లిలో స్వల్పంగా 0.5 మి.మీ. నమోదైంది.

News October 25, 2025

CIAను బురిడీ కొట్టించి ఆడవేషంలో తప్పించుకున్న లాడెన్!

image

అల్‌ఖైదా అధినేత లాడెన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని CIA మాజీ అధికారి జాన్ కిరాయకో వెల్లడించారు. ‘2001లో 9/11 దాడి తర్వాత అఫ్గాన్‌లో అల్‌ఖైదా స్థావరాన్ని చుట్టుముట్టాం. కానీ అల్‌ఖైదా వ్యక్తే అనువాదకుడిగా US మిలిటరీలో చేరాడని మాకు తెలియదు. పిల్లలు, మహిళల్ని పంపిస్తే లొంగిపోతామని ఉగ్రవాదులు చెప్తున్నారని అతడు ఆర్మీని ఒప్పించాడు. దీంతో అక్కడే ఉన్న లాడెన్ ఆడవేషంలో తప్పించుకున్నాడు’ అని తెలిపారు.