News October 24, 2025

హైదరాబాద్ వాతావరణ సమాచారం

image

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.

Similar News

News October 25, 2025

HYD: చిన్నారుల్లో పెరుగుతున్న నిమోనియా.. జర జాగ్రత్త..!

image

HYDలోని NIMS, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం వస్తున్న పిల్లల్లో నిమోనియా కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుత శీతాకాలంలో పిల్లలను బయట వాతావరణానికి, చలికి దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రతాప్ సింగ్ సూచించారు. చిన్నారుల్లో రోజు రోజుకు నిమోనియా కేసులు పెరుగుతున్నాయని, క్రిటికల్ కేసులను ICU ప్రత్యేక విభాగంలో వైద్యం అందిస్తున్నామన్నారు. జర జాగ్రత్త! SHARE IT

News October 25, 2025

HYD: క్రికెట్ ఆడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి

image

HYD మల్కాజిగిరి పరిధి నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురం మైదానంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికుడు తిలగరాజన్‌(41) మైదానంలో క్రికెట్‌ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, కుప్పకూలి మృతిచెందాడు. ప్రతిరోజూ ఉదయం మైదానంలో క్రికెట్‌ ఆడే ఆయన శుక్రవారం ఆట మధ్యలోనే కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News October 25, 2025

హైదరాబాద్ వెదర్ అప్‌డేట్

image

నగరంలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.