News October 24, 2025
ములుగు: గ్రామీణ రహదారులకు మహర్దశ

గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి సీతక్క అన్నారు. కొత్త రహదారులతో పల్లెల ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. రూ.74.43 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొత్తం 32 కొత్త రహదారుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 25, 2025
సిరిసిల్ల: దివ్యాంగుల పెట్రోల్ బంక్ అభినందనీయం: ఇన్‌ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల కలెక్టరేట్: దివ్యాంగుల పెట్రోల్ బంక్ ఏర్పాటు అభినందనీయమని సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. శనివారం ఆమెను కలిసిన పెట్రోల్ బంక్ నడుపుతున్న దివ్యాంగులు, జిల్లా యంత్రాంగం సహకారంతో తమకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెట్రోల్ బంక్ నిర్వహణ వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
News October 25, 2025
కాకినాడ: అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 25, 2025
తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక పాఠ్యాంశాలు

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక అంశాలకు పెద్దపీట వేశామని తెలుగుశాఖ అధ్యక్షుడు డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. కళాశాల స్వయంప్రతిపత్తి హోదా సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు చేశామన్నారు. పాఠ్యప్రణాళికలో స్వయంప్రతిపత్తి నిబంధనలను అనుసరించి, స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ సముచిత మార్పులు చేశామని,ఈ మార్పు తొలిసారిగా జరుగుతోందని పేర్కొన్నారు.


