News October 24, 2025
FLASH: సిద్దిపేట జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 25 నుంచి నవంబర్ 9 వరకు సిటీ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు అనుమతులు లేకుండా నిర్వహించకూడని చెప్పారు. బలవంతంగా వ్యాపార సముదాయాలు మూయించడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 25, 2025
సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు..!

రాబోయే పండుగలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 28, నవంబర్ 2న సికింద్రాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 30, నవంబర్ 4వ తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రావడానికి అవకాశం కల్పిస్తున్నట్లు CPRO శ్రీధర్ పేర్కొన్నారు.

SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్‌న్యూస్

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.