News October 24, 2025
పొలిటికల్ టర్న్ తీసుకున్న వైద్యురాలి ఆత్మహత్య కేసు

MHలో సంచలనం రేపిన వైద్యురాలి <<18091644>>ఆత్మహత్య<<>> కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను ‘మేనేజ్’ చేయాలంటూ డాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు రాజకీయ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు CM ఫడణవీస్ ఆదేశాలతో ప్రధాన నిందితుడు SI గోపాల్‌ను సస్పెండ్ చేశారు.
Similar News
News October 25, 2025
తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్

AP: మొంథా తుఫాను పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ‘తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. తీరం వెంబడి గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు వంటివన్నీ సమకూర్చండి. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి’ అని సూచించారు.
News October 25, 2025
ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్‌ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.
News October 25, 2025
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. OCT 23తో అప్లై గడువు ముగియగా.. OCT 28 వరకు పొడిగించారు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in


