News October 24, 2025

శబరిమల గోల్డ్ చోరీ.. అమ్మేశానన్న నిందితుడు

image

కేరళ శబరిమల అయ్యప్ప ఆలయంలోని బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాటి నుంచి 476 గ్రా. బంగారం వేరు చేసి కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి అమ్మినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అంగీకరించాడు. సిట్ అధికారుల దర్యాప్తులో దీన్ని గోవర్ధన్ సైతం ధ్రువీకరించాడు. కాగా 2019లో తాపడాలకు మెరుగులు దిద్దే పనిని ఉన్నికృష్ణన్‌కు అప్పగించగా బంగారం బరువు తగ్గిన విషయం ఇటీవల బయటపడింది.

Similar News

News October 25, 2025

జాగ్రత్త.. పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

image

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్‌ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్​వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.

News October 25, 2025

SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్‌న్యూస్

image

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News October 25, 2025

ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/