News October 24, 2025
సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Similar News
News October 25, 2025
భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

పాక్ బార్డర్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్‌స్పేస్‌లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News October 25, 2025
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్‌కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT
News October 25, 2025
జాగ్రత్త.. పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.


