News October 25, 2025

రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్‌నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్‌లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.

Similar News

News October 25, 2025

ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.

News October 25, 2025

HYD: వస్త్రాల వ్యర్థాల రీసైక్లింగ్ అంతంతే..!

image

గ్రేటర్ HYDలో ఏటా సుమారుగా 15 టన్నులకు పైగా వస్త్రాలకు సంబంధించిన వ్యర్థాలు విడుదలవుతున్నాయి. కానీ.. వీటిని రీసైక్లింగ్, పునర్వినియోగం చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లుగా TGTRS తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఈ శాతాన్ని మరింత పెంచడం కోసం కృషి చేస్తామని పేర్కొంది.

News October 25, 2025

మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

image

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.