News October 25, 2025

కొడిమ్యాల: ‘ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి’

image

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కొడిమ్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. సండ్రళ్లపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని లత సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Similar News

News October 25, 2025

సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

image

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్‌కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.

News October 25, 2025

ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.

News October 25, 2025

విజయవాడ: ఉదయం ఒక ధర.. మధ్యాహ్నం ఇంకో ధర!

image

నగరంలోని పూల మార్కెట్‌లో ఇష్టారీతిన, నచ్చిన ధరలకు పూలను విక్రయిస్తున్నారు. గులాబీ పూలు తెల్లవారుజామున KG ధర రూ.160కే అమ్ముతుండగా మధ్యాహ్నం రూ.300 వరకు అమ్ముతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువైతే అమాంతం ధరలు పెంచేస్తున్నారు. కర్ణాటక నుంచి దిగుబడి అవుతుండటంతో ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. వీఎంసీ స్థలంలో వ్యాపారం ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.