News October 25, 2025
పెద్దపల్లిలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన DM&HO

పెద్దపల్లిలోని స్కానింగ్ సెంటర్లను DM&HO డాక్టర్ వాణిశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ ప్రసాద్ మెమోరియల్, లీలావతి నర్సింగ్ హోమ్, శ్రీదేవీ ఆసుపత్రి, రమా ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. రిజిస్టర్డ్ గైనకాలజిస్ట్ ఏ స్కాన్‌లు చేస్తున్నారా, గర్భిణులకు స్కాన్ చేసిన వివరాల రికార్డ్స్ పరిశీలించారు. ఫారం ఎఫ్ సరిగా నమోదు చేస్తున్నారా లేదా ఆరా తీశారు.
Similar News
News October 25, 2025
సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్‌కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.
News October 25, 2025
ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.
News October 25, 2025
విజయవాడ: ఉదయం ఒక ధర.. మధ్యాహ్నం ఇంకో ధర!

నగరంలోని పూల మార్కెట్‌లో ఇష్టారీతిన, నచ్చిన ధరలకు పూలను విక్రయిస్తున్నారు. గులాబీ పూలు తెల్లవారుజామున KG ధర రూ.160కే అమ్ముతుండగా మధ్యాహ్నం రూ.300 వరకు అమ్ముతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువైతే అమాంతం ధరలు పెంచేస్తున్నారు. కర్ణాటక నుంచి దిగుబడి అవుతుండటంతో ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. వీఎంసీ స్థలంలో వ్యాపారం ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.


