News April 9, 2024
BREAKING: ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ
లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు మరో షాక్ తగిలింది. నేటితో జుడీషియల్ గడువు ముగియగా ED అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. గత నెల 15న కవితను ED అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నిన్న కోర్టు కొట్టేసింది.
Similar News
News January 10, 2025
కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
TG: కలెక్టర్లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్త పథకాల విధివిధానాల ఖరారుపైనా చర్చిస్తున్నారు.
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ వచ్చేది ఈ OTTలోనే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.450+ కోట్లతో రూపొందిన ఈ చిత్ర OTT హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపాయి. అయితే, దాదాపు 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అంచనా వేశాయి.
News January 10, 2025
జై షాకు బీసీసీఐ సన్మానం
ఐసీసీ నూతన ఛైర్మన్ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.