News October 25, 2025
కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.
Similar News
News October 25, 2025
ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 25, 2025
కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
News October 25, 2025
ప్రాథమిక రంగానికి ఊతం ఇవ్వాలి: కలెక్టర్

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను చురుకుగా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన పరిశ్రమల-ఎగుమతుల ప్రోత్సాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ డైరీ & పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్య శాఖ, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు.


