News October 25, 2025

‘బెల్ట్’ దందా.. ముందరుంది మేడారం జాతర..!

image

ములుగు జిల్లాలోని కొన్ని వైన్ షాప్‌లకు క్రేజ్ కొనసాగుతోంది. సమీపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరుండటం, బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుండడంతో దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. జంగాలపల్లి షాపునకు 61 దరఖాస్తులు, మల్లంపల్లి 77, ఏటూరునాగారంలోని మూడు దుకాణాలకు 48, 49, 42, రామన్నగూడెం షాపునకు 48 దరఖాస్తులు వచ్చాయి. మేడారంలోని మూడు దుకాణాలకు 11, 12, 13 చొప్పున డీడీలు పడ్డాయి.

Similar News

News October 25, 2025

ఖైరతాబాద్, శేరిలింగంపల్లికి ఉప ఎన్నిక: KTR

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలిస్తే రాబోయే GHMC ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని KTR ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. TGలోని పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని KTR తెలిపారు. కాంగ్రెస్‌ చేసిన మోసం ప్రజలకు వివరించాలన్నారు.

News October 25, 2025

‘ఎస్‌ఐఆర్‌’ పకడ్బందీగా రూపొందించాలి: సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

image

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రిటర్నింగ్‌ అధికారులతో ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరి ‘ఏ’ను బీఎల్‌ఓ యాప్‌ ద్వారా ధ్రువీకరిస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు.

News October 25, 2025

అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవులు

image

భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సూచనలతో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ డీఈవో సుబ్రహ్మణ్యం నేడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారాన్ని అన్ని డివిజన్ల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల వారి పరిధిలోని హెచ్ఎంలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి.