News October 25, 2025
రెగ్యులర్ SSC విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఆఫర్

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రవేశించేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి అవకాశం కల్పిస్తూ ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. ఓల్డ్ సిలబస్‌లో పదో తరగతి ఫెయిలైన వారు రూ.300లు చెల్లించి ఈనెల 31 లోపు అడ్మిషన్స్ పొందాలని డీఈఓ నారాయణ తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ SSC ఫెయిల్ అయిన వారు 1,130 మంది ఉన్నారన్నారు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 25, 2025
జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 25, 2025
కోపల్లెలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.
News October 25, 2025
‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.


