News October 25, 2025

అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.

Similar News

News October 26, 2025

పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

image

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.

News October 26, 2025

OTTలోకి ‘కాంతార: ఛాప్టర్-1’ వచ్చేది అప్పుడేనా?

image

‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ₹800Cr+ గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హిందీ, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ మినహా మిగతా దక్షిణాది భాషల్లో ఈ నెలాఖరున OTT( అమెజాన్ ప్రైమ్ వీడియో)లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 26, 2025

‘డ్రై డే’ పాటిద్దాం.. అంటువ్యాధులను అరికడదాం: వైద్యాధికారి

image

అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ సూచించారు. శనివారం ఆయన బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టిక, ఫార్మసీ గది, ల్యాబ్ తీరును పరిశీలించారు. దోమ కాటు ద్వారా సంభవిస్తున్న మలేరియా, డెంగ్యూ నివారణ కోసం ‘డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.