News October 25, 2025

జనగామ జిల్లాలో 134 మంది సర్వేయర్ల ఎంపిక..!

image

భూమి కొలతలు, భూ తగాదాలు, సర్వేయర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇక ఆ సమస్య తీరనుంది. జనగామ జిల్లాకు 134 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఎంపికయ్యారు. వారికి త్వరలో ఎవరు ఎక్కడికి అనేది పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం 29 క్లస్టర్లకు గాను, క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పడినట్లే.

Similar News

News October 25, 2025

కాకినాడ: అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన

image

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2025

తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక పాఠ్యాంశాలు

image

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక అంశాలకు పెద్దపీట వేశామని తెలుగుశాఖ అధ్యక్షుడు డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. కళాశాల స్వయంప్రతిపత్తి హోదా సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు చేశామన్నారు. పాఠ్యప్రణాళికలో స్వయంప్రతిపత్తి నిబంధనలను అనుసరించి, స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ సముచిత మార్పులు చేశామని,ఈ మార్పు తొలిసారిగా జరుగుతోందని పేర్కొన్నారు.

News October 25, 2025

సిద్దిపేట: ‘హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి’

image

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. 2002 ఎలక్టోరల్‌ను 2015 ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ పూర్తి చేసి సరిచూసుకోవాలని తెలిపారు. కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.