News October 25, 2025
GNT: 74 ఏళ్ల క్రితం.. ఇదే రోజు మొదటి సార్వత్రిక ఎన్నిక.!

1951 అక్టోబర్ 25న గుంటూరుకు సంబంధించి ముఖ్యమైన సంఘటన జరిగింది. 1951 అక్టోబర్ 25న భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు గుంటూరు సహా దేశవ్యాప్తంగా జరిగాయి. ఎన్నికలలో గుంటూరు నుంచి ఎస్.వి లక్ష్మీ నరసింహం (IND) 79350 ఓట్లు, తెనాలి నుంచి కొత్తా రఘురామయ్య (INC) 103126 ఓట్లు, నరసరావుపేట నుంచి చాపలమడుగు రామయ్య చౌదరి (IND) 78332 ఓట్ల మెజారిటీతో ఎంపీలుగా గెలుపొందారు.
Similar News
News October 25, 2025
డీసీసీల నియామకం.. వేణుగోపాల్‌తో రేవంత్, భట్టి, మహేశ్ భేటీ

TG: రాష్ట్రంలో డీసీసీల నియామకంపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సైతం హాజరయ్యారు. డీసీసీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడంపై చర్చించారు.
News October 25, 2025
మెుంథా తుఫాన్.. ఈ నెంబర్లు తప్పక గుర్తుంచుకోండి.!

మెుంథా తుఫాను నేపథ్యంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే విద్యుత్ శాఖ తరపున 9440817491, కనిగిరి డివిజన్లో 7893208093, మార్కాపురం డివిజన్లో 9985733999, ఒంగోలు డివిజన్లో 9281034437 కంట్రోల్ రూమ్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
News October 25, 2025
కంది: కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

కంది మండలంలోని శంకర్ పల్లి రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య(55) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పాండు, పోచయ్యలను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


