News October 25, 2025

విజయనగరంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

image

SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 15 మంది యువతకు 45 రోజుల ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణా బస్సుకు JC సేతు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటి అగ్రహారం RTC శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

MNCL: 27న మద్యం దుకాణాల కేటాయింపు

image

నూతన మద్యం పాలసీ విధానం 2025- 27లో భాగంగా మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పివిఆర్. గార్డెన్స్ లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

News October 26, 2025

ఈ నెల 27న ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

News October 26, 2025

పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

image

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.