News October 25, 2025

నేటి నుంచి కవిత ‘జాగృతి జనం బాట’

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’లో పాల్గొననున్నారు. ఉ.9.30 గంటలకు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతారు. అక్కడ నుంచి మ.ఒంటి గంటకు నిజామాబాద్‌లోని ఇందల్వాయి టోల్ గేట్‌కి చేరుకున్నాక ఆమెకు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. 4 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ యాత్రలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో ఆమె భేటీ కానున్నారు.

Similar News

News October 26, 2025

అసలైన భక్తులు ఎవరంటే?

image

లాభాపేక్షతో భగవంతుణ్ని సేవించేవారు వ్యాపారస్తులు అవుతారు. వారు దేవుణ్ని తన వ్యాపార భాగస్వామిగా భావించి, ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కానీ నిజమైన భక్తులు ఎలాంటి స్వార్థం, ఆశయం లేకుండా ‘నేనే నీ దాసుడను, నీవు నా స్వామివి’ అనే నిష్కల్మష భావనతో సేవలు చేస్తారు. ప్రతిఫలం ఆశించకుండా, మనస్సును భగవంతునిపైనే ఉంచి భక్తి చూపుతారు. స్వామి సంతోషమే తన సంతోషంగా భావించి, అందరిలోనూ ఆనందాన్ని నింపుతారు. <<-se>>#Daivam<<>>

News October 26, 2025

భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

image

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>

News October 26, 2025

ఫుడ్ పాయిజనింగ్ కావొద్దంటే ఇవి మస్ట్!

image

TG: రాష్ట్రంలో గత 9 నెలల్లో 34K+ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ‘బయటి ఫుడ్, ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. శుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తినే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు.