News October 25, 2025
జనగామ: కేంద్రాలు కరవాయే.. దళారులదే రాజ్యమాయే!

ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతు నష్టాల పాలవుతున్నారు. సకాలంలో పంట చేతికొచ్చినా అకాల వర్షాలతో కల్లాల్లో తడిసి ముద్దవుతున్నాయి. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రూ.1600 నుంచి రూ.1800లకే దళారులకు విక్రయిస్తూ జనగామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Similar News
News October 25, 2025
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
News October 25, 2025
కోపల్లెలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.
News October 25, 2025
జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


