News October 25, 2025

జనగామ: పెండింగ్‌లో రూ.50లక్షల స్కాలర్షిప్స్!

image

జనగామ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖకు సంబధించిన స్కాలర్ షిప్స్ కేవలం రూ.50లక్షలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.50లక్షలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల స్కాలర్ షిప్స్ పెండింగ్ లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రాగానే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News October 25, 2025

జూబ్లీ బైపోల్: BRS అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు

image

జూబ్లీ బైపోల్ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్‌ను టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి శనివారం కలిశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ‌కి విరుద్ధంగా BRS ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. సొంత పత్రికల్లో విపరీతంగా ప్రచారాలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. BRS అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కింద దీనిని పరిగణించాలని ఆర్వీకర్ణన్‌ను సామ రామ్మోహన్ కోరారు.

News October 25, 2025

బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్‌–వాట్సాప్‌ నం: 9063423950
సంగీత, కంట్రోల్‌ రూమ్‌: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.