News April 9, 2024

ప్రకాశం: శ్రీశైలం వచ్చిన కన్నడ వాసుల కోసం ప్రత్యేక రైలు

image

శ్రీశైలానికి కాలినడకన వచ్చి వెళుతున్న కన్నడ వాసుల సౌకర్యార్థం విజయవాడ నుంచి గిద్దలూరు మీదుగా హుబ్లీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10న విజయవాడలో రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు గిద్దలూరుకు చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుతుందని చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.  

Similar News

News January 9, 2026

ప్రకాశం: సంక్రాంతికి వస్తున్నారా.. గుడ్ న్యూస్!

image

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో 350 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 30, చెన్నైకి 20, విజయవాడకు 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. 13వ తేదీ వరకు నడిపే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తామని చెప్పారు.

News January 9, 2026

ప్రకాశం కలెక్టర్ సంచలన కామెంట్స్.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరోమారు రెవిన్యూ అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించి అమాయకులైన ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకోనంటూ కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తమ అధికారాలను సక్రమంగా వినియోగించాలని, పద్ధతి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.

News January 9, 2026

ప్రకాశం: లోన్ తీసుకున్నారా.. అసలు కడితే చాలు.!

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.