News October 25, 2025

విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

image

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్‌ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.

Similar News

News October 26, 2025

చిత్తూరు: వైద్య సిబ్బందికి సెలవులు లేవు

image

భారీ వర్ష సూచనల నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు లేవని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. ఆదివారం జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సోమ, మంగళ వారాల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News October 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూములు ఇవే.!

image

జిల్లా కంట్రోల్ రూమ్ ➢ 0883–2944455 రాజమహేంద్రవరం ఆర్డీఓ ➢0883–2442344
రాజమహేంద్రవరం అర్బన్ ➢0883–2940695 రాజమహేంద్రవరం రూరల్➢9849903860
కడియం➢6301523482 రాజానగరం➢9494546001 రంగంపేట➢ 9393931667 కోరుకొండ➢9154474851 అనపర్తి➢9441386920 బిక్కవోలు➢ 9849903913 సీతానగరం➢9177096888 గోకవరం➢9491385060 కాల్ చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.

News October 26, 2025

కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

image

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.