News October 25, 2025
ఊహించడానికే భయంకరంగా ఉంది: రష్మిక

కర్నూలు <<18088805>>బస్సు<<>> ప్రమాద ఘటనపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. మంటలలో చిక్కుకున్న ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు, మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని Xలో పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.
News October 26, 2025
నిమిషాల్లోనే అదృష్టం మారి’పోయింది’!

మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్ డోంగ్లీ అనే నోటరీ లాయర్ కొన్ని నిమిషాలపాటు బిలియనీర్‌గా మారారు. తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.2,817 కోట్ల విలువైన 1,312 హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్లు కనిపించడంతో షాకయ్యాడు. ఇది నిజమే అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోగానే ఆ షేర్లన్నీ తన ఖాతాలోంచి మాయమైపోవడంతో కంగుతిన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరగడంతో తన అదృష్టం కాసేపే అని నవ్వుకున్నారు.
News October 26, 2025
ఎలాంటి ఫేస్‌కి ఏ బొట్టు బావుంటుందంటే..

ముఖాన్ని అందంగా మార్చడంలో బొట్టు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోరకాల స్టిక్కర్లున్నాయి. ముఖాకృతిని బట్టి వాటిని ఎంచుకోవాలి. రౌండ్ ఫేస్ ఉంటే పొడుగ్గా ఉండే స్టిక్కర్ ఎంచుకోవాలి. స్క్వేర్ షేప్‌కు రౌండ్ స్టిక్కర్లు, డైమండ్ షేప్‌కు సింపుల్ బిందీ, హార్ట్ షేప్‌కు పొడుగు స్టిక్కర్లు, ఓవల్ షేప్‌కు రౌండ్ బిందీ బావుంటాయి. కొత్త స్టిక్కర్లు ట్రై చేస్తేనే ఏది సెట్ అవుతుందో తెలుస్తుంది.


