News October 25, 2025
HYD: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపిక

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ నెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
Similar News
News October 26, 2025
GNT: ఆయన స్వరమే.. రజినీకాంత్ మాట..!

నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు నాగూర్ బాబు (మనో) సత్తెనపల్లిలో జన్మించారు. గాయకుడిగా పరిచయం అవ్వకముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ఇళయరాజా ఆయన పేరును మనోగా మార్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడాడు. రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు డబ్బింగ్ చెప్పి మెప్పు పొందాడు. నేడు ఆయన పుట్టిన రోజు.
News October 26, 2025
రెంటచింతల: గొర్రెలపైకి దూసుకెళ్లిన లారీ

రెంటచింతల బైపాస్ వద్ద శనివారం ఒక సిమెంట్ లారీ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకురావడంతో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బైపాస్ మార్గంలో లారీ వేగంగా వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
తూ.గో: 1577 హెక్టార్లలో పంట నష్టం

తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 1577.38 హెక్టార్లలో పంటకు పాక్షిక నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. దీనిలో 1374 హెక్టార్లలో వరి పంట నేలవాలగా, 183.29 హెక్టార్లు నీట మునిగాయన్నారు. 13 మండలాల పరిధిలోని 74 గ్రామాలలో 2,176 మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన వెల్లడించారు.


