News October 25, 2025
నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
Similar News
News October 26, 2025
వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్‌లు సిద్ధం చేశామన్నారు.
News October 26, 2025
గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.
News October 26, 2025
కరూర్ బాధితులను కలవనున్న విజయ్

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.


