News October 25, 2025
బాలానగర్‌లో మురుగు కాలువలో శిశువు మృతదేహం

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. భవాని మాత ఆలయం సమీపంలోని మురుగు కాలువలో గురువారం సాయంత్రం అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కవర్‌లో లభ్యమైంది. పంచాయతీ సిబ్బంది సమాచారంతో ఎస్ఐ లెనిన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 26, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు
News October 26, 2025
ఆస్ట్రేలియాతో టీ20లకు అందుబాటులో నితీశ్!

గాయం కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమైన <<18098198>>నితీశ్<<>> రెడ్డి ఈ నెల 29 నుంచి జరిగే 5 మ్యాచుల T20 సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని cricbuzz తెలిపింది. ఒకవేళ తొలి మ్యాచులో ఆడకపోయినా, ఆ తర్వాత మ్యాచుల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు మూడో వన్డేలో క్యాచ్ తీసుకుంటూ గాయపడిన <<18098991>>శ్రేయస్<<>> కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని, SAతో నవంబర్ 30న ప్రారంభమయ్యే ODI సిరీస్‌లో ఆడొచ్చని అంచనా వేసింది.
News October 26, 2025
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్: అజీజ్

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.


