News October 25, 2025
మేడ్చల్ మార్గంలో రైల్వే ETS అప్ గ్రేడేషన్ మంజూరు

మేడ్చల్, మహబూబ్‌నగర్, ధోనే మార్గంలో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అప్ గ్రేడేషన్ మంజూరైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రెస్ నోట్ విడుదల చేసింది. రైల్వే మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకోగా, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (ETS) త్వరలోనే అమలు చేస్తామని పేర్కొంది. ఈ పనులు పూర్తయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లు ప్రయాణించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News October 26, 2025
అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు
News October 26, 2025
నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.
News October 26, 2025
రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.


