News October 25, 2025
ద్రాక్షారామ ఆలయ ఆవరణలో వ్యక్తి మృతి

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం దొంగ భీమన్న అనే కార్మికుడు గడ్డి మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆలయ సిబ్బంది వెంటనే ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం. లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
Similar News
News October 26, 2025
తాండూరు: ‘ఈనెల 30వరకు అడ్మిషన్లకు అవకాశం’

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్స్‌కు ఈనెల 30వరకు అవకాశం ఉందని, వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ తెలిపారు. అడ్మిషన్ల పూర్తి వివరాలకు పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్ఛార్జ్ మహేష్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News October 26, 2025
ఉమ్మడి విశాఖలో రూ.220 కోట్ల బకాయిలు

జిల్లా గ్రంథాలయ సంస్థకు ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థలు రూ.220 కోట్లు సెస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 67 గ్రంథాలయాలు ఉన్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీవీఎంసీ వసూలు చేసే ఇంటి పన్నుల్లో గ్రంథాలయ సెస్ కూడా ఉంటుంది. జీవీఎంసీ రూ.200 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంది. సెస్ బకాయిల వసూళ్లకు కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా తెలిపారు.
News October 26, 2025
తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతమో తెలుసా?

AP: ఇవాళ 8-9AM మధ్య పార్వతీపురం జిల్లాలో గరిష్ఠంగా 34.7, NTR జిల్లాలో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మరో 2-3 డిగ్రీల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ఏపీకి 800 KM దూరంలో ఉండటంతో ఆ ప్రభావం ఇప్పుడే కనిపించదని, 300 KMల దగ్గరకు చేరగానే వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే భూమి వేడెక్కి తుఫాన్ ప్రభావం అధికమవుతుందని చెప్పారు.


