News October 25, 2025

GVMCలో ‘స్థాయి’ని మరిచి అవినీతి?

image

GVMC స్థాయి సంఘంలో కొందరు సభ్యులు స్థాయిని మరిచి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్థాయిసంఘం సమావేశాల్లో 215 పనులకు ఆమోదం తెలిపగా..పలు అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు అడిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. పనుల్లో పర్సెంటీజీలు ఇస్తే దేనికైనా ఓకే చెప్పేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాటాల్లో తేడా రావడంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగినట్లు నాయకుల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News October 26, 2025

జూబ్లీహిల్స్ బరిలో పాలమూరు బిడ్డ అస్మా

image

మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిర్మలాపూర్‌కు చెందిన షేక్ హుస్సేన్, సాబేర బేగం కుమార్తె అస్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఎం.ఏ. తెలుగు పూర్తి చేసిన ఆమె గతంలో నిరుద్యోగుల తరఫున పోరాటం చేశారు. అస్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపింది.

News October 26, 2025

NGKL: మద్యం టెండర్లతో జిల్లాకు రూ.450.04 కోట్ల ఆదాయం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రూ.450 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చింది. జిల్లాలోని 67 దుకాణాలకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయడంతో ఈ ఆదాయం సమకూరింది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 500కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News October 26, 2025

భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

image

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.