News October 25, 2025

మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

image

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.

Similar News

News October 25, 2025

HYD: BRSతోనే మరింత అభివృద్ధి సాధ్యం: MLA

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచార వేడి రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి వెంగళ్‌రావునగర్ డివిజన్ పరిధి మధురానగర్‌లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అపార్ట్‌మెంట్ వాసులతో MLA ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. BRSతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

News October 25, 2025

నా ఫొటో, పేరు చూసి మోసపోవద్దు: CP సజ్జనార్

image

సైబర్ క్రైమ్‌ మోసాలపై CP సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘వాట్సాప్‌లో DPగా నా ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు.’ అని ఆయన ట్వీట్ చేశారు.
SHARE IT

News October 25, 2025

HYD: ఒక్క రోజులో 8 కేసులు.. రూ.2.55 కోట్లు కొట్టేశాడు..!

image

పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో 500 శాతం లాభం ఇస్తానని ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా 58 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. అనంతరం తన డిజిటల్‌ ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో సంతోషించిన బాధితుడు.. అతడు చెప్పినట్లు రూ.75 లక్షలను పెట్టాడు. ఎంతకీ విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయానని బాధితుడు సైబర్‌ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశాడు. కాగా సదరు సైబర్ నేరగాడు ఇలా ఒక్క రోజులోనే 8కేసుల్లో రూ.2.55కోట్లు కొట్టేశాడు.