News October 25, 2025

HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

image

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.

Similar News

News October 26, 2025

ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు శంభాజీనగర్ స్టేషన్‌గా మార్పు

image

MHలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఔరంగాబాద్ సిటీ పేరునూ ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. పేర్ల మార్పును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. పేర్లు మారిస్తే రైళ్లలో అందరికీ సీట్లు దొరుకుతాయా? ప్లాట్‌ఫామ్స్ క్లీన్‌‌గా ఉంటాయా? టికెట్లు వేగంగా బుక్ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు.

News October 26, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☛ చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ భేటీ
☛ నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజయ్యే అవకాశం: సినీ వర్గాలు
☛ సుందర్.సి దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సినిమా? ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్
☛ ‘కుమారి 21F’ మూవీకి సీక్వెల్‌గా త్వరలో తెరపైకి ‘కుమారి 22F’.. నిర్మాతలుగా సుకుమార్, ఆయన సతీమణి తబిత వ్యవహరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం

News October 26, 2025

నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

image

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.