News October 25, 2025

ఏటూరునాగారం: నడుములోతు వాగు.. వృద్ధురాలి అవస్థ..!

image

ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. గత 4 నెలలుగా ముంపు గ్రామాల ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఇందులో భాగంగా ఏటూరునాగారంలో జరుగుతున్న ఓ ఉచిత కంటి శిబిరానికి వెళ్లేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు నరకయాతన పడింది. నడుములోతు వాగులో దాటి యువకుల సహాయంతో ఒడ్డుకు చేరింది. వాగు తగ్గుముఖం పట్టకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు.

Similar News

News October 26, 2025

అనకాపల్లి: ‘కాలేజీలకు 3రోజులు సెలవులు’

image

మొంథా తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈనెల 27 నుంచి 29 వరకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా వచ్చే మూడు రోజులు <<18107873>>పాఠశాలలకు సెలవులు<<>> ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

News October 26, 2025

విజయనగరం జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 1,04,828 హెక్టార్లలో వరి సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంటలు పాలుపోసే దశ నుండి కోత దశ వరకు వివిధ దశల్లో ఉన్నాయని, వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలాల్లో నీరు చేరితే బయటకు పంపే చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు ముందు వర్షం వస్తే వరి వెన్నులపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంతో పిచికారీ చేయాలన్నారు.

News October 26, 2025

అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.