News October 25, 2025

ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

image

ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మూడు వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ శనివారం ప్రకటించారు. ప్రజలు ముంపునకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 26, 2025

సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే!

image

వన్డేల్లో అత్యధిక పరుగుల లిస్టులో సచిన్(18,426) టాప్లో ఉన్నారు. నిన్న సంగక్కరను(14234)ను కోహ్లీ(14,255) అధిగమించి టాప్2 అయ్యారు. దీంతో సచిన్‌నూ అధిగమిస్తారా? అనే చర్చ మొదలైంది. 2025-26లో IND 15ODIలు ఆడనుంది. ఆసియా కప్, WCలో గరిష్ఠంగా 30 మ్యాచుల ఛాన్స్ ఉంది. విరాట్ సగటున 60-70 రన్స్ చేస్తే 2K రన్స్ అవుతాయి. ఇంకా 2K పరుగులు వెనుకబడి ఉంటారు. సో.. సచిన్ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

News October 26, 2025

వంటింటి చిట్కాలు

image

☛ ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఆ పిండిపై తమలపాకు ఉంచండి.
☛ క్యాబేజీ ఉడికించేటప్పుడు వచ్చే వాసన కొందరికి నచ్చదు. అప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే ఆ వాసన తగ్గుతుంది.
☛ అల్లం వెల్లుల్లి ముద్ద చేసేటప్పుడు చెంచా వంటనూనె చేర్చితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
☛ కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు మట్టివాసన వస్తుంటే నాలుగు పుదీనా ఆకులు వేయండి. వాసన పోయి కూరకు సువాసన వస్తుంది.

News October 26, 2025

వికారాబాద్: BJP జిల్లాధ్యక్ష పదవి.. ఎవరికి దక్కేనో..?

image

వికారాబాద్ జిల్లా BJP అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ రెడ్డి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి BJP నాయకులు ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేను సీనియర్ అంటే నేను సీనియర్ అని పోటీ పడుతున్నారు. మరి అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందోనని నాయకులు వేచిచూస్తున్నారు. వికారాబాద్‌కు దక్కుతుందో లేదంటే పదవి తాండూర్‌కు వెళ్తుందో చూడాలి.