News October 25, 2025
సంగారెడ్డి: ఇంటర్ సిలబస్‌లో మార్పులు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. 20 ఇంటర్నల్, 80 ఎక్స్‌టర్నల్ పరీక్షల మార్కులు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పు చేసింది.
Similar News
News October 26, 2025
ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 26, 2025
కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 26, 2025
అష్ట ధర్మములు ఏవంటే?

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>


