News October 25, 2025
ప్రతీ ఆలయాన్ని దీపాలతో అలకరించాలి: మంత్రి కొండా

కార్తీక దీపోత్సవాన్ని కనుల పండగలా నిర్వహించాలని, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక దీపోత్సవం 22.10.2025 నుంచి 19.11.2025 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News October 28, 2025
అమలాపురం: ACB అధికారుల నంబర్ ఇదే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవినీతి శాఖ రూపొందించిన పోస్టర్లను జిల్లా రెవెన్యూ, రవాణా శాఖ, తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ట్రెజరీ కార్యాలయం వద్ద అతికించారు. ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే 9440446160కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ అధికారులు కోరారు.
News October 28, 2025
ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
News October 28, 2025
కోనసీమ: లైసెన్స్ స్లాట్లను మార్చుకోండి..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిటిజెన్ లెవెల్‌లో స్లాట్స్ మార్చుకునే సదుపాయం తెచ్చామని చెప్పారు.


